దేశ విభజన సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా మారిన మిల్ఖా సింగ్.. పేదరికం, ఆకలి వంటి కష్టాలను ఎదుర్కొన్నారు. సైన్యంలో చేరిన తర్వాతే ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కేవలం పట్టుదలతో సాధన చేసి ‘ఫ్లయింగ్ సిఖ్’గా పేరుగాంచారు. 1960 ఒలింపిక్స్‌లో పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోయినా, భారతదేశ క్రీడా చరిత్రలో ఒక లెజెండ్‌గా నిలిచారు.