RR: మొయినాబాద్ PS పరిధిలోని బాకారం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోళ్ల పందెంపై రాజేంద్రనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు కృష్ణంరాజుతో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60,950 నగదు,4 కార్లు,13 ఫోన్లు, 18 కోడి కత్తిలు, మొత్తం 22 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.