ATP: టన్ను అరటి ధర కేవలం రూ. 1,000 పలుకుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.