TPT: తిరుపతి మంగళం రోడ్డులో జిల్లా రవాణా అధికారులు శనివారం వాహన తనిఖీలు నిర్వహించి సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై దృష్టి సారించారు. మొత్తం 22 కేసులు నమోదు చేసి ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మోటార్ వాహనాల సెక్షన్ 184 ప్రకారం మొబైల్ డ్రైవింగ్‌కు మొదటిసారి రూ.1,500, రెండోసారి రూ.10,000 వరకు జరిమానా విధించబడుతుందని వారికి తెలిపారు.