బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో వైసీపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయానికి సంబంధించి పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.