SKLM: జిల్లా RTC సంస్థ ఆధ్వర్యంలో పార్సిల్ సర్వీస్ సేవలు భేష్ అని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ పేర్కొన్నారు. సేవలందించిన రెండు ఏజెన్సీలు నిర్వాహకులను ఇవాళ స్థానిక కాంప్లెక్స్‌లో ఆయన అభినందించారు. ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు సంబంధించిన వివిధ రకాల పార్సిల్లను ఎంత దూరమైన అందించే సేవలో ఆర్టీసీ పనిచేస్తుందన్నారు.