ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని సేలంవారిపల్లిలో ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల ఆవరణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యవసాయ కళాశాల డా. పి వీరన్న గౌడ్ అన్నారు. శనివారం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు.