SRD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన పటాన్చెరు విద్యార్థులను గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ అభినందించారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు పట్లోళ్ల ఆర్యన్ రెడ్డి, తీర్థ అనే విద్యార్థులు ఇటీవల వికారాబాద్లో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ సెలక్షన్స్లో పాల్గొని ఎంపికయ్యారు.