సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గుడిపాటి నరసయ్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. గుడిపాటి నరసయ్యకు తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పేరుంది. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో మోత్కుపల్లి నరసింహులు చేతిలో ఓటమి పాలయ్యారు.