AP: తెలుగు రాష్ట్రాల్లో 218 కేసులు ఉన్న మోస్ట్ వాంటెడ్ గజ దొంగను శ్రీకాకుళం పోలీసులు పట్టుకున్నారు. గత 33 ఏళ్లల్లో ఆ దొంగ 60 కేసుల్లో జైలు పాలయ్యాడు. చాపర గ్రామానికి చెందిన దున్న కృష్ణ పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఇప్పటి వరకు 50 కేజీల బంగారం, 300 కేజీల వెండి, కేజీ ప్లాటినం దొంగతనం చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.