ADB: ఇటీవల బదిలీలలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏసీపీగా విధులు నిర్వహించి ఆదిలాబాద్ అదనపు ఎస్పీ పరిపాలనగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా మౌనిక బాధ్యతలను స్వీకరించారు. పరిపాలన విధులు మరింత చురుకుగా జరిగేలా చర్యలు చేపడతామని తెలియజేశారు.