కృష్ణా: పోతేపల్లి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుశీల మాట్లాడుతూ.. సమాజంలో పెరుగుతున్న నేరాలు, వాటి నివారణ, వ్యక్తిగత భద్రత, చట్టపరమైన అవగాహన వంటి పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.