W.G: అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలకు కమిటీల ఏర్పాటుకు పెంటపాడు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు ఐసీడీఎస్ తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధికారిణి టీఎల్, సరస్వతి తెలిపారు. ఇవాళ పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల కమిటీ సభ్యులకు విధివిధానాలను తెలియజేశారు.