MBNR: జిల్లాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాకిటి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. నిందితుల నుంచి ల్యాప్టాప్-1, మొబైల్ ఫోన్లు-2, బైక్ 1, రూ.1,50,000/- రికవరీ చేశామన్నారు.