WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 6,65,660 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వీరి వెంట కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.