ఇఫీ వేదికపై నటుడు అనుపమ్ ఖేర్ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘మనమంతా దూరదర్శన్ ద్వారా సినీ జీవితాన్ని ప్రారంభించాం. దూరదర్శన్ మనల్ని సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం మన అదృష్టం. నేనూ దూరదర్శన్ వల్లే ఈ రంగానికి వచ్చాను.. ఎన్నిటికీ దానిని మర్చిపోలేను. దూరదర్శన్ మన జీవితాల్లో నిలిచి ఉండే పరిమళం.. ఎప్పటికీ మనల్ని కౌగిలితో పెనవేసుకుని ఉంటుంది’ అని అన్నారు.