PPM: సాలూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తుందని తెలిపారు. నాణ్యతకు రాజీ లేకుండా ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.