NLR: ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం గ్రామం నుంచి పశువులు మేపుకునేందుకు నదిలోకి వెళ్లిన కాపర్లు ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో నది మధ్యలో చిక్కుకున్నారు. వారిలో వెంకట రమణయ్య, శ్రీనివాసులు, కాలేషా, కవిత, చెన్నయ్య తోపాటు మరో మహిళ ఉన్నట్లు సమాచారం.