KKD: హోంగార్డ్స్ విధి నిర్వహణలో చేసిన సేవలు ఎంతో విలువైనవని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో మరణించిన ముగ్గురు హోంగార్డుల కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్పీ అందజేశారు. గార్డుల కుటుంబాలను ఆదుకోవడం తమ సామాజిక బాధ్యత, పోలీస్ శాఖ కర్తవ్యం అని పేర్కొన్నారు.