TG: గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల తాటి, ఈత మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటేందుకు, వాటిని పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. గీత కార్మికుల కులవృత్తి రక్షణతో పాటు వారి పిల్లల విద్యాభ్యాసానికి కూడా ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.