ATP: గుత్తిలో ఓ జూనియర్ కళాశాలలో శనివారం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.