NGKL: బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో బాల్యవివాహాల నిర్మూలన అవగాహన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బాల్యవివాహాలతో ఎన్నో అనర్థాలు వస్తాయని వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.