AP: రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై CM చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ నాటికి రోడ్లపై గుంతలు ఉండకూడదని, మరమ్మతుల్లో రాజీ పడకూడదని స్పష్టంచేశారు. గతేడాది రూ.861 కోట్లతో పనులు చేపట్టామని, ఈ ఏడాది కూడా రూ.2500 కోట్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. ఈ మేరకు పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి జనార్దన్కు సూచించారు.