సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నదీ తీరంలో శనివారం రాత్రి లైటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బాబా జీవిత బోధనలు, సేవా కార్యక్రమాలను కాంతుల రూపంలో వెదజల్లుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. వేలాది మంది భక్తులు నది ఒడ్డున కూర్చుని ప్రదర్శనను ఆస్వాదిస్తున్నారు. కాగా, సత్యసాయి జయంతి వేడుకలలో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి బాబా భక్తులు తరలి వస్తున్నారు.