సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రతినిధి బృందం మదీనాకు చేరుకుని బాధితుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మదీనా పవిత్ర స్థలమైన జన్నత్ ఉల్ బఖీ సమాధి స్థలంలో బాధితుల మృతదేహాలను ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి కూడా పాల్గొన్నారు.