HYD: జయ జయహే తెలంగాణతో అందెశ్రీ ముక్కోటి గొంతుకలను ఏకం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర ప్రధానమైనదని, అందెశ్రీ ఉద్యమ స్పూర్తితో, ఆయన పాటతో తెలంగాణ కల సాకారమైందన్నారు. జయ జయహే తెలంగాణను పాఠ్యపుస్తకాలలో మొదటి అంశంగా చేర్చడం జరిగిందన్నారు.