MDK: శివంపేట్ మండలం తిమ్మాపూర్ మార్గంలోని రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై గండ్లు, రాళ్లు, దెబ్బతిన్న బ్లాక్టాప్తో వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాల అవకాశం పెరుగుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతులు వెంటనే చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.