అన్నమయ్య: బి. కొత్తకోట మండలం హార్శిలీహిల్స్ ఘాట్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం పొగమంచు కారణంగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. తిరుమల హైట్ వద్ద (3వ మలుపు) జరిగిన ఈ ప్రమాదంలో కారు కి.మీ నంబర్ రాళ్లను తాకకుండా తప్పించుకోవడం పెద్ద ప్రమాదం నుంచి రక్షణగా నిలిచింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.