TG: HYD జలసౌధలో నీరుపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష ముగిసింది. ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు మంత్రి చెప్పారు. ఏ ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ అవసరమో ప్రణాళికలు తయారుచేశామన్నారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సంబంధించి CWC క్లియరెన్స్ తుది దశకు చేరుకుందన్నారు.