ATP: వజ్రకరూరు గ్రామ శివారులోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుంతకల్లు నుంచి ఉరవకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంక్ వద్ద పశువులు దారికి అడ్డంగా రావడంతో వాటిని తప్పించబోయి పొలం గట్టుపైకి దూసుకెల్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.