సత్యసాయి: ధర్మవరం మండలం రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా నీటి ప్రవాహంతో పూర్తిస్థాయిలో నిండింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి చిలకం ఛాయాదేవితో కలిసి శనివారం చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. చెరువు నిండటంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.