VZM: ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచం అంతా మన వైపు చూస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లతో సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు తప్పుదోవ పట్టించడంపై మంత్రి మండి పడ్డారు.