కోనసీమ: AP స్టేట్ అడ్వైజరీ బోర్డు అండ్ చైల్డ్ లేబర్ ఛైర్మన్గా అయినవిల్లి మండలం మాగాం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం 11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల లిస్టు విడుదల చేసింది. ఈ లిస్టులో ఆయన పేరు ఉండటంతో పలువురు పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.