E.G: తిరుమలపాలెం గ్రామంలో ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో సారా బట్టిలపై దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సారా కాస్తున్న ఒక వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు చెప్పారు. మండలంలో ఎవరైనా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.