డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి కూడా ఇది తోడ్పడుతుంది.