ELR: గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా లెప్రసి, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి లక్ష్మీనారాయణ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లెప్రసీ కేసుల వివరాలను పరిశీలించారు. గృహ సందర్శన సమయంలో ప్రజల చర్మంపై స్పర్శ లేని, ఎర్రని లేదా రాగి రంగు మచ్చలు కనిపిస్తే వారిని వెంటనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించాలని ఆశా కార్యకర్తలు, సిబ్బందిని ఆదేశించారు.