ATP: పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ను శనివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు రికార్డులు, కేసుల ఛేదింపు, క్రైమ్.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రామసుబ్బయ్య, ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.