MBNR: భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మహబూబ్ నగర్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మునావర్ అహ్మద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశనుండే చట్టాలపై అవగాహన పెంచుకుంటే చట్టాల ద్వారా పరిజ్ఞానం పెరుగుతుందన్నారు.