MHBD: గంగారం మండల కేంద్రంలో రేపు మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రైతు వేదిక వద్ద జరిగే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై చీరలు అందజేస్తారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఇవాళ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన నాయకులను కోరారు.