SKLM: శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ తాండ్రసి మెట్ట వద్ద రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై ఎం. మధుసూదనరావు తెలిపారు. మృతుని వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్లు ఉంటాయని, నల్లటి దుస్తులు ధరించినట్లు తెలియాజేశారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాలు గుర్తించేందుకు చర్యలు చేపట్టామని ఎస్సై పేర్కొన్నారు.