ప్రకాశం: హనుమంతునిపాడులో సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. లేబర్ కోడ్ చట్టాల పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు.