సత్యసాయి: పెనుకొండ టీడీపీ కార్యాలయంలో నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణాలకు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటి నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం రూ. 2,50,000 ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు.