VSP: తెలుగు భాష, సంస్కృతుల రక్షణ కోసం పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉందని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద రిలే దీక్షలు శనివారం కూడా కొనసాగాయి. మన దేశవాళీ పాలకులు జాతి ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, వారిని ప్రశ్నించకపోవడం వల్లనే వారు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.