MHBD: పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు శనివారం సీపీఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకన్న మాట్లాడుతూ.. అటవీ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఆదివాసీలు, మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతోందని ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.