ADB: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ పథకాలు అమలు తీరును పరిశీలించాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తదితరులున్నారు.