TG: తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా బాధిత చిన్నారులకు అండగా ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ముందుకొచ్చింది. బాధిత చిన్నారులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్.. ఇవాళ HYDలోని రెయిన్ బో పిల్లల ఆస్పత్రితో MOU కుదుర్చుకుంది. ఈ పిల్లలకు ఉచిత చికిత్సతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ సౌకర్యం అందించనుంది.