GDWL: అలంపూర్ మండల కేంద్రంలో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు సకాలంలో ప్రజలకు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా రైతుబంధు, మహిళలకు నెలకు రూ.2500, వికలాంగులకు రూ.4000 పెన్షన్ల పథకాలు త్వరగా అమలుచేయాలన్నారు.