సూర్యాపేట భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో పట్టణానికి చెందిన పెనుగొండ రవివర్మ రెడ్డికి చోటు లభించింది. BJP జిల్లా ఆఫీస్ సెక్రటరీగా పెనుగొండ రవి వర్మ రెడ్డి ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.