WNP: జిల్లాలో ఎంపికైన దివ్యాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. శనివారం వనపర్తి జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి సుధారాణికి వినతి పత్రం సమర్పించారు. సహాయ పరికరాలు పంపిణీ కోసం గతంలో ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసిందని, దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు పరికరాలు అందజేయాలన్నారు.