GDWL: పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల ఆరోగ్య భద్రత, ఆర్థిక రక్షణ కోసం ఆరోగ్య భీమా అనివార్యమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని గ్రీవెన్స్ హాల్లో హోంగార్డుల సంక్షేమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సేవలో నిమగ్నం అయ్యే సమయంలో అనారోగ్యం ఎదురైనా, ఆరోగ్య భీమా రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు.